చిత్తాపూర్‌లో కవాతుకు పోటాపోటీ
రాయచూరు రూరల్: కలబుర్గి జిల్లా చిత్తాపూర్‌లో ఆర్‌ఎస్‌ఎస్ కవాతుకు సిద్ధమవుతున్న తరుణంలో ఆర్‌ఎస్‌ఎస్‌తో పాటు మూడు సంఘాల నుంచి కలబుర్గి జిల్లాధికారి దరఖాస్తులు అందాయి. చిత్తాపూర్‌లో ఆర్‌ఎస్‌ఎస్, భీమ్ ఆర్మీ, కురుబ సమాజం, దళిత ప్యాంథర్ ఒకే రోజు నవంబర్ 2న కవాతుకు మూడింటికి అవకాశం ఇవ్వాలంటూ అర్జీలను జిల్లాధికారి ఫౌజియా తరన్నంకు విన్నవించారు. ఈ విషయంపై మంగళవారం కార్యాలయంలో జరిగిన సమావేశంలో అందరి వాదనలు విన్న అధికారులు దానికి సంబంధించిన నివేదికను కలబుర్గి హైకోర్టుకు సమర్పించనుంది. సమావేశంలో ఆర్‌ఎస్‌ఎస్ నేతలు కృష్ణాజీ జోషి, ప్రహ్లాద్, బీజేపీ ఉపాధ్య అంబారాయలున్నారు.
మూడు సంఘాల నుంచి అర్జీల స్వీకారం


