వ్యక్తి హత్య కేసులో నిందితుల అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

వ్యక్తి హత్య కేసులో నిందితుల అరెస్ట్‌

Oct 29 2025 8:03 AM | Updated on Oct 29 2025 8:03 AM

వ్యక్

వ్యక్తి హత్య కేసులో నిందితుల అరెస్ట్‌

సాక్షిబళ్లారి: తాలూకాలోని అసుండి గ్రామ సమీపంలోని బైపాస్‌లో పాతకక్షలతో ఈ నెల 23వ తేదీ రాత్రి రవికుమార్‌ అనే వ్యక్తిని దారుణంగా హత్య చేసిన కేసులో పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు. రవికుమార్‌ హత్యపై పీడీహళ్లి పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు కావడంతో జిల్లా ఎస్పీ, డీఎస్పీ ఆదేశాలతో రవికుమార్‌ను హత్య చేసిన అదే గ్రామానికి చెందిన దొడ్డహొన్నూర స్వామి, శేఖర్‌, దుబ్బ హొన్నూర స్వామి, దొడ్డ ఎర్రప్ప, నాగరాజ్‌, ఆటో ఎర్రిస్వామి, ప్రకాష్‌, సురేంద్ర, ప్రసాద్‌ హత్య చేసినట్లు గుర్తించారు. నలుగురు నిందితులను అరెస్ట్‌ చేయడంతో పాటు హత్యకు ఉపయోగించిన మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్‌ చేసిన నలుగురిని పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. మిగతా వారు పరారీలో ఉన్నారు. కాగా రవికుమార్‌ హత్య కేసులో పూర్తి న్యాయం చేయాలని, నిందితులు ఇంకా బయట ఉన్నారని జిల్లా బీజేపీ అధ్యక్షుడు అనిల్‌కుమార్‌ మోకా, బీజేపీ నాయకులు ఓబుళేశు తదితరులు జిల్లా ఎస్పీని కలిసి మనవి చేశారు.

కొబ్బరి చెట్టెక్కి కూర్చొన్న దొంగ

హుబ్లీ: దొంగ.. దొంగ.. పట్టుకోండి అంటూ ఆ గ్రామస్తులు వెంటపడటంతో సదరు దొంగ ఎటూ తప్పించుకొనే దారి లేక వెంట పడిన వారి బారి నుంచి తనను తాను రక్షించుకోవడానికి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఈ అరుదైన, ఆసక్తి గల హైడ్రామా గదగ్‌లోని వివేకానంద నగర లేఔట్‌లో మంగళవారం సూర్యోదయాన చోటు చేసుకుంది. చోరీ ఆరోపణలపై స్థానికులు వెంటాడగా ఆ యువకుడు చెట్టు ఎక్కాడు. బసవరాజ్‌ షోలాపుర సుమారు 40 అడుగుల ఎత్తైన టెంకాయ చెట్టు పైకెక్కాడు. ఇతని స్వస్థలం బెళగావి జిల్లా కబ్బూరు కాగా తెల్లవారు జామున రైల్లో వచ్చి గదగ్‌లో దిగాడు. అనంతరం వివేకానంద లేఔట్‌లో ఓ ఇంటి తలుపు తట్టాడని చెబుతున్నారు.

కంటి వైద్య పరీక్ష శిబిరం

బళ్లారిఅర్బన్‌: స్థానిక కంటోన్‌మెంట్‌ లయన్స్‌ క్లబ్‌, అగర్వాల్‌ హాస్పిటల్‌ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక జయరాం విద్యాలయంలో ఉచిత కంటి వైద్య పరీక్ష శిబిరం ఏర్పాటు చేశారు. శిబిరంలో సుమారు 200 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు చేశారు. కార్యక్రమంలో లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు జి.శ్రీనివాస్‌రెడ్డి, జోనల్‌ చైర్‌ పర్సన్‌ రాజేష్‌, విద్యాలయం చైర్మన్‌ నిఖిలేశ్వర్‌, ప్రధానోపాధ్యాయిని అనగశ్రీ, అగర్వాల్‌ ఆస్పత్రి ప్రముఖులు, ఇతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

సీఎస్‌ఐ చర్చిలో

ప్రత్యేక ప్రార్థనలు

హుబ్లీ: కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడమే దేవుడి పరమార్థం అని దేశ్‌పాండే నగర్‌లోని సీఎస్‌ఐ ప్రార్థన మందిరం సీనియర్‌ రెవరెండ్‌ బోధకులు సురేష్‌ జాన్సన్‌ తెలిపారు. కేఎంసీ ఆస్పత్రిలో గత కొన్ని నెలలుగా మద్య వ్యసన విముక్తి కోసం చికిత్స పొందుతున్న వారు మందిరానికి వచ్చిన వేళ వారి కోసం ఉదయమే ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు. ఆయన మాట్లాడుతూ యువకులు విలువైన జీవితాన్ని మద్యం తదితర చెడు అలవాట్లకు బానిసలుగా మారి బలి చేసుకోరాదన్నారు. ఏసు ప్రభువు శిష్యులైన పీటర్‌ తదితరుల అనుభవంతో కూడిన బోధనలను ఆయన వివరించారు. చెడు అలవాట్ల నుంచి శాశ్వతంగా విముక్తి చెందడంతో పాటు తమ విలువైన జీవితాన్ని సార్థకం చేసుకుని సామాజిక స్పృహతో మెలగాలని సూచించారు. సదరు మద్య వ్యసన పరుల తల్లిదండ్రుల ఆరోగ్యం, ఇతర విషయాల్లో బాగుండేలా ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

నీటి కొలనులో చెప్పు

హంపీలో బడవిలింగ ఆలయం అపవిత్రం

ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన భక్తులు

తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని డిమాండ్‌

హొసపేటె: ప్రపంచ పర్యాటక కేంద్రంగా బాసిల్లుతున్న హంపీలోని బడవిలింగ ఆలయ పవిత్ర నీటి కొలనులో చెప్పు తేలుతున్నట్లు కనిపించడంతో ఉద్రిక్తత నెలకొంది. పర్యాటకులుగా వచ్చిన గుర్తు తెలియని దుండగులు చెప్పు వదిలారని ప్రత్యక్ష సాక్షులు ఆరోపించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన భక్తులు ఆలయంలో సరైన భద్రతా ఏర్పాట్లు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆలయంలో ఇలాంటి సంఘటన జరగడం ఇది మూడో సారి. ఈ సంఘటన సోషల్‌ మీడియాలో తీవ్ర ఆగ్రహానికి దారి తీసింది. స్థానికులు ఈ సంఘటనను పురావస్తు శాఖ దృష్టికి తెచ్చారు. ఈ ఆలయాన్ని 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య పాలకులు నిర్మించారని చరిత్ర చెబుతోంది. రక్షిత స్మారక చిహ్నం అయినా పూజలు, ఇతర ఆచారాలు అక్కడ ప్రతి రోజూ నిర్వహిస్తారు.

మనిషికి సంస్కారం ప్రధానం

రాయచూరు రూరల్‌: సమాజంలో మనిషికి సంస్కారం ప్రధానమని సాయి మందిర్‌ చీఫ్‌ కిరణ్‌ అభిప్రాయ పడ్డారు. మంగళవారం నగరంలోని టాగూర్‌ కళాశాలలో టాగూర్‌– 2025 ఉత్సవాలను ప్రారంభించి మాట్లాడారు. సంస్కృతి, సంప్రదాయ, ఆచార, విచారాలను బోధించడం మనందరి కర్తవ్యమని, వాటిని సద్వినియోగ పర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో వీరేంద్ర జాలదార్‌, పదాధికారులు డీ.నరేష్‌, మురళీధర్‌ కులకర్ణి, దానమ్మ, అంబరీష్‌ మేదర్‌, వసంత పతంగి, తుంగా హిరేమఠ్‌లున్నారు.

వ్యక్తి హత్య కేసులో  నిందితుల అరెస్ట్‌ 1
1/1

వ్యక్తి హత్య కేసులో నిందితుల అరెస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement