8న కనకదాసు జయంతికి అన్ని ఏర్పాట్లు చేయండి
బళ్లారిటౌన్: నవంబర్ 8న భక్త కనకదాసు జయంతిని వైభవంగా జరపాలని అదనపు జిల్లాధికారి(ఏడీసీ) మహ్మద్ జుబేర్ అధికారులకు సూచించారు. మంగళవారం అధికారులతో జరిగిన ముందస్తు ఏర్పాట్ల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఆ రోజు ఉదయం 9 గంటలకు కుమారస్వామి గుడి వద్ద కనకదాసు ప్రతిమకు పూలమాల సమర్పించాలన్నారు. అనంతరం ఆయన చిత్రపటాన్ని నగర ప్రముఖ వీధుల్లో వివిధ కళా బృందాలతో ఊరేగింపు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మధ్యాహ్నం జోళదరాశి దొడ్డనగౌడ రంగమందిరంలో వేదిక కార్యక్రమాన్ని కూడా ఎలాంటి లోటు లేకుండా విజయవంతం చేయాలని ఆయన ఆదేశించారు.
సిద్దలింగేశ్వర రోడ్డుగా
పేరు పెట్టండి
రాయచూరు రూరల్: రాయచూరు నుంచి మన్సలాపూర్ గ్రామానికి వెళ్లే రహదారికి సిద్దలింగేశ్వర రోడ్డుగా పేరు పెట్టాలని మన్సలాపూర్ గ్రామస్తులు డిమాండ్ చేశారు. సోమవారం నగరసభ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో గ్రామ పంచాయతీ అధ్యక్షుడు రాఘవేంద్ర బోరెడ్డి మాట్లాడారు. నగరం నుంచి 4 కి.మీ.ల దూరంలో ఉన్న గ్రామానికి వెళ్లే రోడ్డుకు ఆ పేరు పెట్టాలని కోరుతూ నగరసభ కమిషనర్ జుబిన్ మహాపాత్రోకు వినతిపత్రం సమర్పించారు.
యరగేరలో
ఆర్‌ఎస్‌ఎస్ కవాతు
రాయచూరు రూరల్ : రాయచూరు తాలూకా యరగేరలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) ఆధ్వర్యంలో కవాతు నిర్వహించారు. మాజీ శాసన సభ్యుడు తిప్పరాజ్ హవల్దార్ అధ్యక్షతన వందలాది మంది ఆర్‌ఎస్‌ఎస్ సభ్యులు కవాతు చేశారు. బాల గణ వేషధారి కవాతు చూపరులను మరింతగా ఆకట్టుకుంది.
మంటల్లో కారు బుగ్గి
హొసపేటె: హొసపేటె నుంచి కంప్లికి వెళ్లే మార్గంలో బుక్కసాగర గ్రామ సమీపంలో సోమవారం రాత్రి కారులో మంటలు చెలరేగిన సంఘటన జరిగింది. కంప్లికి చెందిన ప్రకాష్ అనే వ్యక్తికి చెందిన ఈ కారు టైర్ దగ్గర ముందుగా మంటలు కనిపించాయి. డ్రైవర్ కిందకు దిగి చూసేసరికి కారు క్షణాల్లో మంటల్లో చిక్కుకుంది. సమాచారం అందగానే సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది మంటలను ఆర్పారు. ఘటనపై కమలాపుర పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
రైతుల సంక్షేమమే
సర్కారు ధే ్యయం
●ఎమ్మెల్యే హంపయ్య నాయక్ వెల్లడి
●మాన్విలో పత్తి కొనుగోలు కేంద్రం షురూ
రాయచూరు రూరల్ : రైతుల సంక్షేమమే ధే ్యయంగా సర్కార్ పని చేస్తోందని మాన్వి శాసన సభ్యుడు హంపయ్య నాయక్ పేర్కొన్నారు. ఆయన మంగళవారం మాన్విలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. హుబ్లీ భారతీయ పత్తి మండలి అధికారులు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన రైతులకు మూడు రోజుల్లో వారి ఖాతాలో డబ్బులను జమ చేయాలని సూచించారు. ప్రస్తుతం రైతులు కష్టాల సుడిలో ఉన్నారని, అలాంటి రైతులను ఆదుకోవాలన్నారు. మాన్వి తాలూకాలో 30 వేల హెక్టార్లలో పత్తి పంట సాగు చేశారన్నారు. 3,140 మంది రైతులు పేర్లు నమోదు చేసుకున్నారన్నారు. తహసీల్దార్ భీమరాయ, ఏపీఎంసీ కార్యదర్శి రంగనాథ్, హుబ్లీ సీసీఐ అధికారులు వర్మ, అజయ్, శైలజ, సిద్దప్ప గౌడ, సుబాష్ చంద్ర నాయక్‌లున్నారు.
8న కనకదాసు జయంతికి అన్ని ఏర్పాట్లు చేయండి
8న కనకదాసు జయంతికి అన్ని ఏర్పాట్లు చేయండి
8న కనకదాసు జయంతికి అన్ని ఏర్పాట్లు చేయండి
8న కనకదాసు జయంతికి అన్ని ఏర్పాట్లు చేయండి


