డిసెంబర్ 13న లోక్ అదాలత్
కేజీఎఫ్ : డిసెంబర్ 13న చివరి లోక్ అదాలత్‌ను నిర్వహిస్తున్నట్లు జిల్లా సెషన్స్ న్యాయమూర్తి శివకుమార్ తెలిపారు. శనివారం నగరంలోని న్యాయవాదుల సంఘం కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ ఏడాది అక్టోబర్ 13నాటికి 1,99,93,873 కేసులను పరిష్కరించినట్లు తెలిపారు. కక్షిదారులు లోక్ అదాలత్ ద్వారా కేసులను రాజీమార్గంలో పరిష్కరించుకుంటే డబ్బు, సమయం ఆదా అవుతుందన్నారు. కుటుంబ కలహాలు, చెక్‌బౌన్స్ తదితర ఎన్నో కేసులను లోక్‌అదాలత్ ద్వారా పరిష్కరించుకునేందుకు అవకాశం ఉందన్నారు. సమావేశంలో న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు రాజగోపాలగౌడ, న్యాయమూర్తి నాగలక్ష్మి, ముజాఫర్ మాంజరి, వినోద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


