
ప్రేమ ఫలించాలంటే పాస్ చేయండి సారూ
రాయచూరు రూరల్: రాష్ట్రంలో పదవ తరగతి సమాధాన పత్రాలు దిద్దుతున్న అధికారులకు విచిత్రమైన అనుభవాలు ఎదురవుతున్నాయి. బెళగావి జిల్లా చిక్కోడిలో పదోతరగతి పరీక్ష రాసిన ఓ విద్యార్థి సమాధాన పత్రానికి రూ.500 నోటు జమ చేసి ఉండటంతో కలబురిగిలో వాల్యుయేషన్ అధికారులు గమనించి కంగుతిన్నారు. తాను ప్రేమించిన అమ్మాయి నాకు దక్కాలంటే ఈ నోటు తీసుకొని తనను పాస్ చేయాలని వేడుకుంటూ జవాబు పత్రంలో రాసి ఉంది. నేను పదిలో ఉత్తీర్ణుడైతేనే ప్రేమిస్తానని బాలిక చెప్పిందని ఆ చీటీలో రాశాడు. ఈ రూ.500 నోటు తీసుకొని టీ తాగాలని సూచించాడు.
టెన్త్ పరీక్ష సమాధాన పత్రంతో రూ.500 నోటు జత