జీవితంపై విరక్తితో తల్లీకూతురు ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

జీవితంపై విరక్తితో తల్లీకూతురు ఆత్మహత్య

Feb 14 2024 8:42 AM | Updated on Feb 14 2024 9:41 AM

- - Sakshi

ఎంత కష్టం వచ్చిందోగానీ తల్లీకూతురు నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలబురగి జిల్లా శహబాద్‌ దగ్గర కాగిణా నదిలో జరిగింది.

యశవంతపుర: ఎంత కష్టం వచ్చిందోగానీ తల్లీకూతురు నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలబురగి జిల్లా శహబాద్‌ దగ్గర కాగిణా నదిలో జరిగింది. కలబురగి నగరంలోని ఎంబీ నగరలో నివసించే తల్లి సుమలత (45), కూతురు వర్ష (22) సోమవారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిపోయారు.

కుటుంబ సభ్యులు వెతికినా కనిపించలేదు. రాత్రి కాగిణా నదిలో దూకారు. మంగళవారం వీరి మృతదేహాలను పోలీసులు కనుగొన్నారు. జీవితంపై విరక్తి కలిగి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. శహబాద్‌ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వారింట్లో కుటుంబ కలహాలు ఉన్నట్లు ఇరుగుపొరుగు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement