బనశంకరి: లంచం కేసులో చెన్నగిరి బీజేపీ ఎమ్మెల్యే మాడాళ్ విరూపాక్షప్పను లోకాయుక్త పోలీసులు విచారణ తీవ్రతరం చేశారు. విరూపాక్షప్పను సోమవారం రాత్రి తుమకూరు జిల్లా క్యాత్సంద్ర వద్ద అరెస్టు చేశారు. రాత్రి బెంగళూరులో లోకాయుక్త ఆఫీసులో ఉంచి భోజనం, నీటి బాటిల్‌ను, బెడ్‌షీట్‌ను అందజేశారు. టోపీ కావాలనడంతో ఇచ్చారు.
అర్ధరాత్రి 12 గంటల వరకు లోకాయుక్త అధికారులు విరూపాక్షప్ప పై ప్రశ్నల వర్షం కురిపించారు. కానీ సరైన సమాధానాలు ఇవ్వలేదని తెలిసింది. ఆయన నివాసంలో సోదాల్లో దొరికిన రూ.8 కోట్లు ఎక్కడ నుంచి వచ్చింది అనేది ప్రధానంగా ప్రశ్నించారు. డబ్బు కు సంబంధించిన ఆధారాలు ఇవ్వలేదని తెలిసింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం ఆయనను ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో విరూపాక్షప్పను హాజరుపరచగా, ఏప్రిల్ 1వ తేదీ వరకు లోకాయుక్త కస్టడీకి జడ్జి బీ.జయంత్‌కుమార్ ఆదేశాలిచ్చారు. దీంతో లోకాయుక్త అధికారులు ఆయనను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.
● లోకాయుక్త ముమ్మర విచారణ