
శివమొగ్గ జిల్లాలో నిరసన
శివాజీనగర: ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ వివాదం రాష్ట్రంలో ఆందోళనలకు కారణమైంది. మంగళవారం వివిధ చోట్ల లంబాణి, బంజారా సముదాయం ప్రజలు ఆందోళనలు నిర్వహించారు. టైర్లకు, నాయకుల దిష్టిబొమ్మలకు నిప్పు పెట్టి తెలిపారు. సోమవారం శివమొగ్గ జిల్లా శికారిపుర పట్టణంలో మాజీ సీఎం యడియూరప్ప ఇంటిని ముట్టడించడంతో ఆందోళనలకు బీజం పడింది. ఈ గొడవ వెనుక కాంగ్రెస్, జేడీఎస్ హస్తముందని బీజేపీ ఆరోపించగా, యడియూరప్ప అంటే సరిపడని బీజేపీ నాయకులే ధర్నాను చేయించారని కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ అన్నారు. ఇంతలోనే రాష్ట్రంలో పలు ప్రాంతాలకు ధర్నాలు విస్తరించాయి. శివమొగ్గ జిల్లా కుంచేనహళ్లిలో లంబాణి తండాకు చెందిన వందలాది మంది ధర్నా చేశారు. ఇతర ప్రాంతాలకు వెళ్లే బస్సులను అడ్డుకొన్నారు. బాగలకోట జిల్లాలో బీళగి, హునగుందతో పాటు ఇతర 10కిపైగా తాండాల్లో ధర్నా చేశారు.
శాంతిభద్రతలపై సీఎం ఆదేశం
ఈ ధర్నాల వల్ల శాంతి భద్రతలకు భంగం కలగరాదని సీఎం బసవరాజ బొమ్మై హోంమంత్రి జ్ఞానేంద్రకి, డీజీపీ ప్రవీణ్‌సూద్, నిఘా చీఫ్ ఉమేశ్, శాంతిభద్రతల విభాగపు ఏడీజీపీ అలోక్‌కుమార్‌లకు ఆదేశించారు. బంజారాల జనాభా అధికంగా ఉన్న శివమొగ్గ, దావణగెరె, బాగలకోటె, బీదర్, కల్బుర్గి, బళ్లారి, రాయచూరు, కొప్పళ, హావేరితో పాటు ఇతర చోట్ల కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
రిజర్వేషన్లపై కొత్త రచ్చ
పలుచోట్ల బంజారాల ధర్నాలు
