
పార్టీ గుర్తును చూపుతున్న గాలి జనార్దన్‌రెడ్డి
గంగావతి: తాలూకాలోని పలు గ్రామాల్లో మంగళవారం కేఆర్‌పీపీ సంస్థాపకులు గాలి జనార్దన్‌రెడ్డి తమ పార్టీ గుర్తును ప్రజలకు పరిచయం చేస్తూ ముమ్మర ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వెళ్లిన ప్రతి గ్రామంలో పార్టీ కార్యకర్తలు ప్రజలు పూలవర్షం కురిపించి ఘనస్వాగతం పలికారు. ఆయా గ్రామాల్లో ప్రచార సభను ఏర్పాటు చేసి తమ పార్టీ ప్రణాళికను, చేపట్టే అభివృద్ధి పనుల గురించి వివరించారు. తమ పార్టీకి ఫుట్‌బాల్ గుర్తు రావడంపై హర్షం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఈ గుర్తుకు ఓటు వేసి తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా జనార్దన్‌రెడ్డి సమక్షంలో పలు పార్టీలకు చెందిన వారు వందలాది మంది కేఆర్‌పీపీలో చేరారు.
రాళ్లదాడి రాజకీయ ప్రేరితం
హుబ్లీ: మాజీ సీఎం యడియూరప్ప ఇంటిపై రాళ్ల దాడి ఘటన రాజకీయ ప్రేరేపితం అని హుబ్లీ ధార్వాడ పశ్చిమ ఎమ్మెల్యే అరవింద బెల్లద తెలిపారు. నగరంలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ, రిజర్వేషన్‌కు సంబంధించి బంజార వర్గాల్లో నెలకొన్న ఆందోళనతో ఈ రాళ్లదాడి చేశారన్నారు. తనపై ఎవరు పోటీ చేసినా ఈసారి ఎక్కువ ఓట్ల తేడాతో తానే గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.