
నీటి సమస్యపై అధికారులకు వివరిస్తున్న రెడ్డి శ్రీనివాస్
గంగావతి రూరల్: తుంగభద్ర ఎడమ కాలువకు ఈనెల 31 వరకు నీరు అందించి రైతులను ఆదుకోవాలని ఏపీఎంసీ సభ్యులు, కనకగిరి బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ బోర్డు అధికారులకు మనవి చేశారు. వివిధ కంపెనీలకు నీరు అందించడానికి తుంగభద్ర నదికి ఏప్రిల్ 1 నుంచి 10 వరకు 1200 నుంచి 1800 క్యూసెక్కుల నీటి విడుదలపై రైతులతో కలిసి పోరాటం చేస్తామని హెచ్చరించారు. అప్పుడే వేసవి ఎండలకు డ్యాంలో నీటి నిల్వ తగ్గుతుండగా ఇలాంటి చర్యలు అశాసీ్త్రయం అని తెలిపారు. మాజీ జెడ్పీ సభ్యులు అమరేశప్ప, టీపీ మాజీ అధ్యక్షులు సిద్దనగౌడ, కె.నాగేశ్వరరావు, ఆలపాటి సూర్యారావు, గోవిందు పాల్గొన్నారు.