
హక్కుపత్రాలను అందించిన తహసీల్దార్ గౌసియాబేగం
కంప్లి: చాలా ఏళ్లుగా నివాసముంటున్న వారిదే నేల యోజన ద్వారా రెవెన్యూ గ్రామంగా పరివర్తించిన చిన్నాపుర గ్రామంలో 1.7 ఎకరాల ప్రైవేట్ భూమిలో గత 50 ఏళ్లుగా ఉంటున్న 30 కుటుంబాలకు హక్కుపత్రాలను తహసీల్దార్ గౌసియాబేగం పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ హక్కుపత్రాలు పొందిన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రామ పంచాయతీలో రిజిస్టర్ చేసుకొని 9/11 దాఖలాలు పొందాలన్నారు. అనేక ఏళ్లుగా నివాసముంటున్నా స్థలం హక్కుపత్రాలు దొరకడం లేదని, ప్రభుత్వం చొరవ తీసుకొని హక్కుపత్రాలు అందించిందన్నారు. ఈ సందర్భంగా మెట్రి జీపీ అధ్యక్షులు తిమ్మప్ప, ఉపాధ్యక్షురాలు జయలక్ష్మి జడేగౌడ, సభ్యురాలు నాగమ్మ కుశాలప్ప, పీడీఓ శ్రీశైలగౌడ, ఆర్‌ఐ గణేష్, వీఏ శివరుద్రయ్య గ్రామస్తులు పాల్గొన్నారు.