
మాట్లాడుతున్న బషీరుద్దీన్
రాయచూరు రూరల్: ఆర్డీఏ పనులను నిర్మితి, క్యాషుటెక్ కంపెనీలకు అప్పగించడం తగదని బషీరుద్దీన్ ఆరోపించారు. మంగళవారం పాత్రికేయుల భవనంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నగర ప్రాధికార రూ.10.20 కోట్లతో చేపట్టనున్న ఆలయాలకు కమానుల(ఆర్కిటెక్) నిర్మాణ పనులను జెడ్పీ, నగరసభ, పీడబ్ల్యూడీ, ఇతర ఏజెన్సీలకు కేటాయించకుండా భవనాల నిర్మాణాలు చేపట్టే నిర్మితి, క్యాషుటెక్ కంపెనీలకు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. గ్రామాల్లో నిర్మాణాలు చేయడానికి అవకాశం లేకున్నా నిధుల దుర్వినియోగానికి, కమీషన్లకు ఆశపడి ఎమ్మెల్యే పనులు చేయించారని ఆరోపించారు. నగరసభ, జెడ్పీ, టీపీ, పీడబ్ల్యూడీ శాఖల అనుమతి లేకుండా కమానులను నిర్మించడాన్ని ఖండించారు. ఈ విషయంలో జిల్లాధికారి నిర్లక్ష్యం వహించడం సరికాదన్నారు.