కేజీఎఫ్: నియోజకవర్గంలో పలువురు బీజేపీ, జేడీఎస్ కార్యకర్తలు ఆ పార్టీలను వీడి ఎమ్మెల్యే రూపా శశిధర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంగళవారం తాలూకాలోని బూడిదమిట్ట గ్రామంలో ఆ గ్రామ ప్రముఖులు, మహిళలు ఎమ్మెల్యే నిర్వహిస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఆ పార్టీలను వీడి కాంగ్రెస్‌లోకి చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రూపా శశిధర్ మాట్లాడుతూ నియోజవర్గంలో తాను నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఎంతో మంది కాంగ్రెస్‌లోకి చేరుతున్నారన్నారు. నియోజకవర్గంలో రూ.10 కోట్ల వ్యయంతో చెక్‌డ్యాంలను నిర్మించామన్నా రు. దీని వల్ల నియోజకవర్గంలో అంతర్జలాల స్థాయి పెరిగి రైతులకు ఎంతో అనుకూలమైందన్నారు. ఈ సందర్భంగా జీపీ అధ్యక్షుడు రాంబాబు, మాజీ అధ్యక్షుడు నాగరాజ్ పాల్గొన్నారు.