
మండ్య: మండ్య జిల్లాలోని మద్దూరు పట్టణంలో వెలసిన ప్రఖ్యాత హోళె ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో హుండీలను లెక్కించారు. గత ఆరు నెలల్లో వచ్చిన నగదు రూ. 5.93 లక్షలుగా తేలింది. తహసీల్దార్ టి.ఎన్. నరసింహమూర్తి, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
బీజేపీలో చేరిక
కృష్ణరాజపురం: మహాదేవుపుర నియోజకవర్గం పరిధిలోని మారతహళ్లి బీజేపీ కార్యాలయంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ యువనాయకుడు ఆకాశ్, ఎమ్మెల్యే అరవింద లింబావళి ఆధ్వర్యలో బీజేపీలో చేరారు. ఎమ్మెల్యే అరవింద లింబావళి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పురసభ నూతన అధ్యక్షురాలికి సన్మానం
విజయపుర (బెంగళూరు గ్రామీణ): విజయపుర పట్టణంలోని శ్రీ నగరేశ్వర స్వామి దేవాలయం ఆవరణంలో ఉన్న ప్రార్థనా మందిరంలో శరణ సాహిత్య పరిషత్ కదళి వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పురసభ అధ్యక్షురాలు విమలా బసవరాజు, విజయపుర రోటరీ అధ్యక్షుడు హెచ్.ఎస్.రుద్రమూర్తి, జేసీఐ అధ్యక్షుడు ఎన్.సి మునివెంకటరమణప్పను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సాహిత్య పరిషత్ అధ్యక్షుడు అప్పారావు, అక్కొణి, ఉపాధ్యాయురాలు గిరిజాంబ, రుద్రేష్ తదితరులు పాల్గొన్నారు.
