
హుండీ నగదు లెక్కిస్తున్న సిబ్బంది
దొడ్డబళ్లాపురం: దొడ్డ తాలూకాలో ప్రసిద్ధి శ్రీసుబ్రమణ్యఘాటి దేవాలయంలో హుండీ కానుకలు లెక్కించారు. ఈసారి అత్యధికంగా రూ.92 లక్షల ఆదాయం రావడం విశేషం. హుండీలో 57 గ్రాముల వెండి కానుకలు లభించాయి. రూ.92,15,526 నగదు లభించింది. ఇటీవలే దేవాలయంలో సప్తపది పేరున సామూహిక వివాహాలు జరిగినందున హుండీ ఆదాయం పెరింగింది. ఈ సందర్భంగా దేవాలయం ఈఓ కృష్ణప్ప, మేనేజర్ నంజప్ప సిబ్బంది హాజరయ్యారు.
నలపాడ్‌పై మరో వివాదం
యశవంతపుర: యువ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ నలపాడ్ పుట్టిన రోజు సందర్భంగా అతని సహచరులు పార్టీ కోసం ఓ మేకను కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకుండా మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నలపాడ్ సహచరుడు రామచంద్ర అలియాస్ రామనాయక్, శరత్‌కుమార్ అనే వ్యాపారి వద్ద నాలుగన్నర లక్షల విలువైన మేకను కొనుగోలు చేశాడు. ఏడాది కాలం నుంచి డబ్బులు ఇవ్వకుండా వేధిస్తున్నారు. ఈ విషయం నలపాడ్ దృష్టికి తెచ్చిన ఎలాంటి ప్రయోజనం లేదని శరత్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన పోలీసులు తీసుకోవటంలేదన్నారు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
మొబైల్ దుకాణంలో అగ్ని ప్రమాదం
బనశంకరి: విజయనగరలో ఓ మొబైల్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దుకాణంలో రాత్రంతా ఓ మొబైల్‌ను చార్జింగ్ పెట్టాడు. దీంతో షార్ట్‌సర్క్యూట్ ఏర్పడి మంటలు చెలరేగాయి. మంగళవారం తెల్లారుజాము సమయంలో దుకాణం పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. ఈ ఘటనపై విజయనగర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.