శివాజీనగర: బెంగళూరు నగరంలో బైక్ ట్యాక్సీలను ఆపాలని ఆటో డ్రైవర్లు చేస్తున్న ఆందోళనలకు పరిష్కారం కనిపించడం లేదు. తాజాగా వారు ప్రభుత్వానికి మరో అల్టిమేటం ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఈనెల 20న ఒకరోజు ఆటో సమ్మె చేశారు. అయినా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. కుటుంబ సభ్యులతో కూడా వీడియోలు చేసి తమ కష్టాలను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ప్రభుత్వం పట్టించుకోలేదు. తాజాగా ఎన్నికలను బహిష్కరించం తప్ప మాకు మరో మార్గం లేదని, ర్యాపిడోల కారణంగా కనీసం పిల్లలకు స్కూల్ ఫీజులు కూడా కట్టలేని స్థితిలో ఉన్నామని ఆ వీడియోలు డ్రైవర్లు వాపోయారు. ఇదే వీడియోను రవాణా మంత్రి శ్రీరాములకు కూడా పంపి బైక్ ట్యాక్సీలను బ్యాన్ చేయాలని విన్నవించారు.