
బాగేపల్లి: అభివృద్ధి విషయంలో బాగేపల్లి ఎమ్మెల్యే ప్రజలకు నమ్మక ద్రోహం చేశారని, వచ్చే ఎన్నికల్లో బాగేపల్లి ప్రజలు బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని ఆరోగ్య వైద్య శాఖ మంత్రి సుధాకర్ అన్నారు. మంగళవారం చేలూరులో తాలూకా పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ...తాలూకా ఏర్పాటు చేసింది సంకీర్ణ ప్రభుత్వమైనా, తాలూకాలకు కార్యాలయాలు నిర్మాణం చేసింది బీజేపీ అని గర్తు చేసుకోవాలన్నారు. చేలూరు తాలూకాలో ఎక్కడ అభివృద్ధి చేశారో చూపించాలని అన్నారు. అభివృద్ధి మంత్రం పఠించే ప్రతిపక్ష నాయకుడు సిద్దరామయ్యకు చేలూరు కనిపించలేదని అన్నారు.