
విద్యార్థులతో దాత హరిబాబు, రంగస్వామినాయుడు, ఉపాధ్యాయ బృందం
బనశంకరి: బెంగళూరు శివాజీనగర ప్రభుత్వ తెలుగు ఉన్నత పాఠశాలలో మంగళవారం ఎస్‌ఎస్‌ఎల్‌సీ పరీక్షలకు హజరవుతున్న విద్యార్థులందరికీ లేఖన సామగ్రిని ఉచితంగా అందజేశారు. దాత హరిబాబు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పేదరికం చదువుకు ఆటంకం కారాదని, ఒకవేళ విద్యార్థులు ఎవరైనా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే తప్పకుండా ఆదుకుంటామని తెలిపారు. విద్యార్థులు బాగా చదువుకుని పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. టాపర్లుగా నిలిచే విద్యార్థులకు మంచి బహుమతులు ఇస్తానని ప్రకటించారు. విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు రంగస్వామినాయుడు మాట్లాడుతూ... దాతలు, తెలుగు పత్రికల అండతోనే ప్రభుత్వ తెలుగు పాఠశాలలు రాణిస్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.