
దేవతల ఊరేగింపు దృశ్యం
పావగడ: తాలూకాలోని కరియమ్మనపాళ్య గ్రామంలో వెలసిన గాదిరి పాలనాయక, మారికాంబదేవి, జాజూరు పాల నాయక, కరియమ్మ దేవి జలధి ఉత్సవం మంగళవారం వైభవంగా జరిగింది. ఉదయం 10 గంటల సమయంలో గౌడశాను భోగ, గొంచిగాళ్లు, తళవారి నాయక తదితర 12 మంది దేవుని అన్నదమ్ములు, పూజారులు దేవతలను ఆలయం నుంచి పూజారి బోరమ్మ భూమి వరకు భక్తి శ్రద్ధలతో ఊరేగింపుగా తరలించి జలధి పూజలు చేశారు. అనంతరం గ్రామ రైతులు గొర్రెలు, మేకలు, పశువులను పాము గూడు చుట్టూ ప్రదక్షిణలు మొక్కలు చెల్లించుకున్నారు. ఉత్సవాల్లో చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వందలాది మంది భక్తులు పూజలు నిర్వహించారు.