
పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతున్న పిళ్ల మునిశ్యామప్ప
దొడ్డబళ్లాపురం: దేవనహళ్లి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా తాను పోటీ చేయాలనుకుంటున్నానని, ఎట్టి పరిస్థితుల్లోనూ తన అభిప్రాయం మార్చుకోనని, పుకార్లను నమ్మవద్దని దేవనహళ్లి మాజీ ఎమ్మెల్యే పిళ్ల మునిశ్యామప్ప స్పష్టం చేశారు. దేవనహళ్లి నియోజకవర్గం నుంచి మాజీ కేంద్రమంత్రి కేహెచ్ మునియప్పను కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించడంతో ఒకే సామాజిక వర్గానికి చెందినవారైన కారణంగా పిళ్ల మునిశ్యామప్ప పోటీ చేయరని తాలూకాలో చర్చ జరుగుతోంది. ఈ కారణంగా మంగళవారం పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి మునిశ్యామప్ప క్లారిటీ ఇచ్చారు. తాను బీజేపీలోకి చేరే ముందు టిక్కెట్ ఇచ్చేలా ఒప్పందం చేసుకునే చేరానన్నారు. మునియప్పపై తనకు అపారమైన గౌరవం ఉందని ఇద్దరం ఒకటే సామాజికవర్గం వారమని, అయితే రాజకీయాలు వేరన్నారు. బీజేపీ నుంచి టిక్కెట్ ఇస్తారని ఆశిస్తున్నానని, ఇస్తే ఖచ్చితంగా పోటీ చేస్తానన్నారు. ఇప్పటికే తాలూకాలో పర్యటిస్తూ ఎన్నికలకు ఏర్పాట్లు చేసుకున్నానన్నారు.
దేవనహళ్లి మాజీ ఎమ్మెల్యే పిళ్ల మునిశ్యామప్ప