బనశంకరి: యువకున్ని దుండగులు హత్య చేసిన ఘటన వీవీ పురం పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. తావరకెరెకు చెందిన రమేశ్ (25) అనే యువకుడు బార్ బెండర్‌గా పనిచేస్తున్నాడు. స్నేహితుడు ఇంద్రేశ్‌తో న్యూ తరుగుపేటేకి వెళ్లగా దుండగులు చాకుతో దాడి చేశారు. ఇంద్రేశ్ తప్పించుకుని పారిపోయాడు. రమేశ్‌ను విచక్షణా రహితంగా పొడవడంతో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దుండగుల కోసం గాలిస్తున్నారు.
కర్ణాటక బ్యాంకు శాఖ ప్రారంభం
తుమకూరు: తుమకూరు నగరంలోని 29వ వార్డు మరళూరు లేఔట్ సదాశివ నగరలో కర్ణాటక బ్యాంక్ నూతన శాఖను సిద్దగంగ మఠాధ్యక్షుడు శ్రీ సిద్దలింగ స్వామి ప్రారంభించారు. ఖాతాదారులకు విస్తృతంగా సేవలు అందించాలని, కర్ణాటక బ్యాంకు మరిన్ని శాఖలు తెరచి అభివృద్ధి చెందాలని స్వామీజీ ఆకాక్షించారు.