
కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత రాహుల్‌గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష, లోక్‌సభ సభ్యత్వం రద్దు వెనుక తన పోరాటం ఉందని
కర్ణాటక: కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత రాహుల్‌గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష, లోక్‌సభ సభ్యత్వం రద్దు వెనుక తన పోరాటం ఉందని, ఎవరైనా గానీ మాట్లాడేముందు ఆలోచించి మాట్లాడాలని ఈ ఉదంతం చాటుతోందని కోలారు జిల్లా ముళబాగిలుకు చెందిన బీజేపీ నాయకుడు పిఎం రఘునాథ్ (67) చెప్పారు. రాహుల్‌పై కోర్టు తీర్పు నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఏప్రిల్ 13వ తేదీన రాహుల్‌గాంధీ కోలారుకు ఎన్నికల ప్రచారానికి వచ్చారని తెలిపారు. ఆ రోజు రాహుల్ ప్రసంగిస్తూ దొంగలందరి పేర్లలో మోదీ అనే పేరు ఉందని ఆరోపించారని తెలిపారు.
మోదీ అనేది గుజరాత్‌లో ఒక కులం, కర్ణాటకలో ఆ పేరు గానుగ కులానికి వర్తిస్తుంది, ఎవరో ఒకరిద్దరు చేసిన తప్పునకు కులం మొత్తాన్ని ఎందుకు నిందించాలి. వెంటనే ఈ విషయాన్ని తాను గుజరాత్‌లోని తన స్నేహితుడు, బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ దృష్టికి తీసుకు వచ్చానని చెప్పారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై పూర్ణేష్ మోదీ సూరత్ కోర్టులో కేసు నమోదు చేశారు, రాహుల్ ఉపన్యాసం ఆడియో, వీడియోలను నేనే పూర్ణేష్ మోదీకి అందించాను, సూరత్ కోర్టుకు హాజరై సాక్ష్యం కూడా చెప్పానని రఘునాథ్ తెలిపారు.
గుజరాత్ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీతో రఘునాథ్ (కుడివైపు వ్యక్తి)