స్నేహితురాలితో జాలీరైడ్‌ విషాదం | One Died In Road accident | Sakshi
Sakshi News home page

స్నేహితురాలితో జాలీరైడ్‌ విషాదం

Mar 27 2023 1:42 AM | Updated on Mar 27 2023 7:52 AM

One Died In Road accident - Sakshi

లక్ష్మి నారాయణ, ప్రియాంక రాజ్‌ ఇద్దరు స్నేహితులు కాగా

మండ్య: వీకెండ్‌ను సంతోషంగా గడుపుదామని బెంగళూరు నుంచి మైసూరుకు ఎక్స్‌ప్రెస్‌ వేపై ఉత్సాహంగా బయల్దేరారు. కానీ విధి చిన్నచూపు చూసి ఘోరం సంభవించింది. జిల్లాలోని మద్దూరు తాలూకా గెజ్జలగెరె వద్ద శనివారం సాయంత్రం మైసూరు ఎక్స్‌ప్రెస్‌ వేపై బైక్‌ ప్రమాదంలో ఓ యువతి మృతి చెందింది. మృతురాలు తమిళనాడుకు చెందిన ప్రియాంకరాజ్‌ (24). వివరాలు.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన లక్ష్మినారాయణగౌడ (25), ప్రియాంక రాజ్‌ బైక్‌పై వేగంగా వెళ్తూ అదుపుతప్పి కింద పడడంతో యువతి అక్కడికక్కడే కన్నుమూసింది. యువకునికి తీవ్ర గాయాలు కాగా మండ్య జిల్లా ఆస్పత్రికి తరలించారు.

భీతావహంగా ఘటనాస్థలి
లక్ష్మి నారాయణ, ప్రియాంక రాజ్‌ ఇద్దరు స్నేహితులు కాగా, బెంగళూరులో టిసీఎస్‌ కంపెనీలో టెక్కీలుగా పనిచేస్తున్నారు. వీకెండ్‌ కావడంతో బైక్‌పై మైసూరుకు జాలీ రైడ్‌కు బయల్దేరారు. ఇంతలోనే ప్రమాదానికి గురయ్యారు. యువకుని ఎడమచేయి పూర్తిగా తెగి పక్కన పడింది. ఘటనాస్థలి అత్యంత భీతావహంగా మారింది. స్థానికులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. యువతి మృతదేహాన్ని మద్దూరు ఆస్పతిలో ఉంచారు. కాగా, ఇదే ప్రాంతంలో శుక్రవారం గూడ్స్‌ వ్యాన్‌– కారు ఢీకొన్నాయి. కారులోని మడికెరివాసులు తల్లీ కుమారుడు విగతజీవులయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement