
బోల్తాపడిన బస్సు
● పలువురికి స్వల్ప గాయాలు
క్రిష్ణగిరి: క్రిష్ణగిరి నుంచి బెంగళూరుకు వెళ్తున్న ప్రైవేట్ బస్సు బోల్తాపడిన ఘటనలో ప్రయాణికులకు స్వల్పంగా గాయపడ్డారు. ప్రమాదం సూళగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకొంది. క్రిష్ణగిరి బస్టాండు నుంచి 50 మంది ప్రయాణికులతో బెంగళూరుకు బయల్దేరిన ప్రైవేట్ బస్సు ఆదివారం మధ్యాహ్నం సుమారు 2 గంటల ప్రాంతంలో క్రిష్ణగిరి– హోసూరు జాతీయ రహదారి పుళియరసి వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తాపడింది. బస్సులో ప్రయాణిస్తున్న సుమారు ఆరుగురికి స్వల్పగాయాలు తగిలాయి. మిగతా ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. సూళగిరి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని క్రిష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు.