మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి జయంతి ముడుపులను శ్రీలలిత సేవా ట్రస్టు సభ్యులు ఆలయ అధికారుల సమక్షంలో లెక్కించారు. హనుమాన్ చిన్న జయంతి పురస్కరించుకుని హనుమాన్ దీక్షాపరులు సమర్పించిన ముడుపుల ద్వారా రూ.1,69,069 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో అంజనారెడ్డి తెలిపారు. ఏఈఓ హరిహరనాథ్, ఉప ప్రధాన అర్చకులు చిరంజీవ స్వామి, స్థానాచార్యులు కపీందర్, పర్యవేక్షకులు సునీల్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
రెండు ఆలయాల్లో దొంగతనం
కథలాపూర్: మండలంలోని భూషణరావుపేటలోగల రామాలయం, మల్లికార్జునస్వామి ఆలయాల్లో గుర్తు తెలియని దుండగులు చొరబడ్డారు. హుండీలను ధ్వంసం చేసి అందులోని డబ్బులు ఎత్తుకెళ్లినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. హుండీల్లో సుమారు రూ.25 వేలు ఉంటాయని చెబుతున్నారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఆలయాలను పరిశీలించి వివరాలు సేకరించారు.


