పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలం రాగినేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న శ్రీనిత్య భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ(ఇస్రో) నిర్వహిస్తున్న యువిక– 2026కు ఎంపికై ంది. రాష్ట్రవ్యాప్తంగా 10 మంది విద్యార్థులను ఎంపిక చేయగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి పెద్దపల్లి మండలం రాగినేడుకు చెందిన శ్రీనిత్య ఒక్కరే ఎంపిక కావడం విశేషం. కాగా.. పెద్దపల్లి మండలం రాగినేడు జిల్లా పరిషత ఉన్నత పాఠశాల నుంచి మూడేళ్లుగా వరుసగా ఇస్రో యువికకు విద్యార్థులు ఎంపిక అవుతున్నారని హెచ్‌ఎం ఆగయ్య తెలిపారు. యువిక –2026కు ఎంపికై న శ్రీనిత్య హైదరాబాద్‌లో 15రోజుల పాటు జరిగే ఈ యంగ్ సైంటిస్టు వర్క్‌షాప్‌లో పాల్గొంటుందని పేర్కొన్నా రు. శ్రీనిత్య ఎంపికయ్యేందుకు కృషి చేసిన గైడ్ టీచర్ జగదీశ్వర్‌రెడ్డి, హెచ్‌ఎం ఆగయ్య, ఉపాధ్యాయులను సర్పంచ్ సోమకుమార్ అభినందించారు. సర్కారు బడుల్లో చదివే విద్యార్థులు తక్కువేమీకాదని రాగినేడు విద్యార్థులు నిరూపించారని ప్రశంసించారు.
కరీంనగర్: జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కుమ్మరిపల్లి ఆదర్శ పాఠశాల విద్యార్థిని చిలువేరి శ్రీనిత్య జాతీయ పరిశోధన సంస్థ ఇస్రో నిర్వహించిన క్విజ్ పోటీల్లో పాల్గొని యువిక కార్యక్రమానికి ఎంపికై ంది. దేశవ్యాప్తంగా 456 మందిలో తెలంగాణ నుంచి 15 మంది సెలెక్ట్ అయ్యారని, వారిలో శ్రీనిత్యం ఉండటం పాఠశాలకు గర్వకారణమని ప్రిన్సిపాల్ కృష్ణప్రసాద్ తెలిపారు. అడిషనల్ కలెక్టర్ బీఎస్.లత, డీఈవో రాము శ్రీనిత్యను అభినందించి, శాలువాతో సన్మానించారు. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ హైదరాబాద్‌కు ఎంపికై నట్లు ఇస్రో నుంచి సమాచారం అందడం చాలా సంతోషంగా ఉందని, మే 10న ఇస్రో టూర్ ఉంటుందని కాల్ లెటర్ అందుకున్న శ్రీనిత్య ఆనందం వ్యక్తం చేసింది. శ్రీనిత్యను అధ్యాపక బృందం, తల్లిదండ్రులు, గ్రామస్తులు, జిల్లా అధికారులు అభినందించారు.


