ఎస్‌పీఈని పునరుద్ధరించాలి
కరీంనగర్: కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ (ఎస్‌పీఈ యాక్ట్ 1976)ను పునరుద్ధరించాలని కోరుతూ జిల్లా కార్మికశాఖ కార్యాలయం ఎదుట శుక్రవారం తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ (టీఎంఎస్‌ఆర్‌యూ) కరీంనగర్‌శాఖ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షుడు చీకోటి శ్రీధర్ మాట్లాడుతూ.. నాలుగు కొత్త కార్మిక చట్టాలతో దేశంలో ఉన్న కార్మికవర్గానికి తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. అనంతరం జిల్లా కార్మికశాఖ అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి, టీఎంఎస్‌ఆర్‌యూ రాష్ట్ర కార్యదర్శులు జి.విద్యాసాగర్, ఏ.సదానందచారి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎం.అంజయ్య, సీఐటీయూ ఉపాధ్యక్షుడు రమేశ్ పాల్గొన్నారు.
క్రీడలకూ ప్రాధాన్యమివ్వాలి
కరీంనగర్‌రూరల్: విద్యార్థులు చదువుతోపాటు క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా ఇంట ర్మీడియట్ అధికారి గంగాధర్ సూచించారు. బొమ్మకల్‌లోని మైనార్టీ గురుకుల బాలుర పాఠశాల–1లో మూడు రోజుల పాటు నిర్వహించే ఉమ్మడి కరీంనగర్ జిల్లాస్థాయి క్రీడా పోటీలను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడలతో విద్యార్థుల్లో క్రమశిక్షణ పెరుగుతుందన్నారు. మానసిక ఒత్తి డితగ్గి, శారీరక ఎదుగుదలకు క్రీడలు దోహాదపడతాయన్నారు. మైనార్టీ గురుకులాల కో–ఆర్డినేటర్ విమల మాట్లాడుతూ క్రీడలు విద్యార్థుల మానసిక ఉల్లాసానికి ఉపయోగపడతా యన్నారు. అనంతరం వాలీబాల్, కబడ్డీ పోటీలు నిర్వహించారు. ప్రిన్సిపాల్స్ వీర్ల మహేశ్, పిడిశెట్టి సంపత్, పి.చంద్రమోహన్, కుమారస్వామి, విజిలెన్స్ అధికారి అక్రమ్‌పాషా, అకడమిక్ కో–ఆర్డినేటర్ మీరాజ్ పాల్గొన్నారు.
ఆక్రమణలు తొలగింపు
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని రోడ్డు ఆక్రమణలపై నగరపాలకసంస్థ అధికారులు ఎట్టకేలకు మరోసారి చర్యలు పూనుకున్నారు.. ‘ఆక్రమణలకు అడ్డా’ పేరిట ‘సాక్షి’లో శుక్రవారం వచ్చిన కథనానికి నగరపాలకసంస్థ అధికారులు స్పందించారు. శుక్రవారం రాత్రి కరీంనగర్, సిరిసిల్ల మెయిన్‌రోడ్డుపై ఉన్న రోడ్డు ఆక్రమణలను తొలగించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింగే రోడ్డు, పుట్‌పాత్ ఆక్రమణలౖపై కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా హెచ్చరించారు. టీపీఎస్ తేజస్విని ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసుల సహకారంతో డీఆర్‌ఎఫ్ సిబ్బంది ఆక్రమణలను తొలగించారు.
పవర్‌కట్ ప్రాంతాలు
కొత్తపల్లి: విద్యుత్ లైన్ల మరమ్మతు చేపడుతున్నందున శనివారం మధ్యాహ్నం 2నుంచి 4 గంటల వరకు 11 కేవీ మహాశక్తి ఆలయం ఫీడర్ పరిధిలోని మహాశక్తి ఆలయం, సంతోష్ నగర్, బాలాజీ సూపర్‌మార్కెట్ ప్రాంతాల్లో సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్ 2 ఏడీఈ ఎం. లావణ్య తెలిపారు. 33/11 కె.వీ.కొత్తపల్లి, రేకుర్తి, బొమ్మకల్ సబ్‌స్టేషన్లలో విద్యుత్ పనులు చేపడుతున్నందున మధ్యాహ్నం 3 నుంచి 5.30 గంటల వరకు కొత్తపల్లి, రేకుర్తి సబ్‌స్టేషన్ల పరిధిలోని ప్రాంతాలు, శ్రీపురం కాలనీ, రజ్వీచమన్, సిటిజన్‌కాలనీ, ప్రియదర్శినికాల నీ, కృష్ణానగర్, ఆటోనగర్, ధర్మనగర్, బైపాస్ రోడ్, బొమ్మకల్, గుంటూర్‌పల్లి, దుర్శేడ్, గోపాల్‌పూర్, నల్లకుంటపల్లి, మరియాపూర్ ప్రాంతాల్లో సరఫరా నిలిపివేస్తున్నారు.
సర్వీస్ క్రమబద్ధీకరించండి
కరీంనగర్ అర్బన్: వీఆర్‌ఏ నుంచి జీపీవోలుగా నియామకమైనవారి సర్వీస్ క్రమబద్ధీకరించాలని గ్రామ పాలన అధికారులు శుక్రవారం కలెక్టరేట్ ఏవో గడ్డం సుధాకర్‌కు వినతిపత్రం అందజేశారు. రెండేళ్ల సర్వీస్ పూర్తి చేసుకుని వార్డు ఆఫీసర్లు, రికార్డు అసిస్టెంట్లు, ఆఫీస్ సబార్డినేట్లుగా సేవలందించామని వివరించారు. రెవెన్యూ వ్యవస్థ రద్దుతో తమ సర్వీస్ ఆగమ్యగోచరంగా మారిందని, కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి మాతృశాఖకు తీసుకోవడం హర్షణీయమని వివరించారు. జీపీవోల సర్వీస్ రూల్స్, జాబ్ ఛార్ట్‌పై స్పష్టతనివ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. సర్వీస్ క్రమబద్ధీకరణతో పాటు ప్రొహిబిషన్ డిక్లేర్ చేయాలని కోరారు.
ఎస్‌పీఈని పునరుద్ధరించాలి
ఎస్‌పీఈని పునరుద్ధరించాలి


