సమష్టి కృషి అభినందనీయం
కరీంనగర్‌అర్బన్/కరీంనగర్‌టౌన్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికారులు, సిబ్బంది కృషి అభినందనీయమని, ఇదే ఉత్సాహంతో విధులు నిర్వహించాలని అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. ఎన్నికలను విజయవంతంగా పూర్తి కాగా జెడ్పీ సీఈవో శ్రీనివాస్, ఎంపీడీవోలు శనివారం అదనపు కలెక్టర్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. కలెక్టర్ పమేలా సత్పతిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడంలో ఆయా మండలాల ఎంపీడీవోలు కీలకంగా పని చేశారని పేర్కొన్నారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ ఇదే స్ఫూర్తితో పనిచేసి జిల్లాకు మంచి పేరు తేవాలని సూచించారు.


