హస్తం హవా
కరీంనగర్: తొలివిడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో హస్తం పార్టీ హవా కొనసాగింది. ఉమ్మడి జిల్లాలో 398స్థానాలకు గానూ 203 స్థానాలు కై వసం చేసుకొని అధికార పార్టీ సత్తా చాటింది. ప్రతిపక్ష బీఆర్‌ఎస్ 121స్థానాలతో పరిమితమై రెండో స్థానంలో నిలిచింది. ఇక బీజేపీ 37 స్థానాలతో మూడో స్థానం దక్కించుకుంది. గత ఎన్నికలతో పోల్చినప్పుడు కాంగ్రెస్ మొదటి స్థానంలోకి దూసుకురాగా, బీజేపీ తన స్థానాలను మెరుగుపరుచుకొని మూడో స్థానంలో నిలిచింది. పెద్దపల్లి జిల్లాలో మొత్తం 99 స్థానాలకు గానూ కోర్టు వ్యవహారంతో పెద్దంపేట ఎన్నికల నిలిచిపోయింది. కమాన్‌పూర్ ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉంది. నాలుగు గ్రామాలను కాంగ్రెస్ ఏకగ్రీవంతో ఎగరేసుకుపోయింది.
హస్తం హవా


