తొలి విడత ప్రశాంతం | - | Sakshi
Sakshi News home page

తొలి విడత ప్రశాంతం

Dec 12 2025 5:52 PM | Updated on Dec 12 2025 5:52 PM

తొలి

తొలి విడత ప్రశాంతం

జిల్లాలో తొలివిడత ఓటింగ్‌ శాతం వివరాలు

ఓటెత్తిన గ్రామాలు

81.42 శాతం ఓటింగ్‌

అర్ధరాత్రి వరకు కొనసాగిన సర్పంచుల ఫలితాలు

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌:

తొలివిడత గ్రామపంచాయతీ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. మొదటి విడత ఎన్నికల్లో భాగంగా కరీంనగర్‌ రూరల్‌, కొత్తపల్లి, గంగాధర, చొప్పదండి, రామడుగు మండలాల్లో మొత్తం 92 గ్రామాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. మూడు గ్రామాల్లో సర్పంచ్‌ పదవులు ఏకగ్రీవం అయ్యాయి. చొప్పదండి మండలంలోని దేశాయిపేట గ్రామంలో సర్పంచ్‌తోపాటు ఎనిమిది వార్డు సభ్యులు ఏకగ్రీవం కావడంతో ఎన్నికలు జరగలేదు. మిగిలిన 91 గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించారు. ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. అనంతరం ఓట్ల లెక్కింపు మొదలైంది. ఐదు మండలాల్లో కలిపి మొత్తం 1,52,408 మంది ఓటర్లకు గాను, 1,24,088 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరిలో 59,504 మంది పురుషులు కాగా, 64,540 మంది సీ్త్రలు ఉన్నారు. మహిళలు 82.51శాతం ఓటుహక్కు వినియోగించుకుని ముందంజలో ఉండగా, 80.26శాతం పురుషులు ఓటుహక్కు వినియోగించుకున్నారు.

పరిశీలించిన అధికారులు

మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ పమేలా సత్పతి తెలిపారు. పోలింగ్‌ జరిగిన గంగాధర, రామడుగు, చొప్పదండి, కొత్తపల్లి మండలాల్లోని పలు పోలింగ్‌ కేంద్రాలను స్వయంగా పరిశీలించారు. సీపీ గౌస్‌ఆలం ఎన్నికల నిర్వహణకు కేటాయించిన పోలీసు సిబ్బందిని, ఓటింగ్‌ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తును క్షుణ్ణంగా పరిశీలించారు.

మండలం మొత్తం గ్రామాలు ఓటర్లు పోలైన ఓట్లు పురుషులు శాతం మహిళలు శాతం మొత్తంశాతం

చొప్పదండి 15 27,677 23,154 11,145 83.02 12,008 84.26 83.66

గంగాధర 33 44,163 34,758 16,293 76.15 18,464 81.10 78.70

కరీంనగర్‌రూరల్‌ 14 22,053 18,672 9,233 84.94 9,438 84.40 84.67

కొత్తపల్లి 06 17,767 14,069 6,810 77.98 7,259 80.35 79.19

రామడుగు 23 40,748 33,435 16,023 81.29 17,411 82.78 82.05

మొత్తం 91 1,52,408 1,24,088 59,504 80.26 64,580 82.51 81.42

తొలి విడత ప్రశాంతం1
1/1

తొలి విడత ప్రశాంతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement