ఐదు మండలాలు.. ఆరుగురు ఏసీపీలు
కరీంనగర్‌క్రైం: జిల్లాలో తొలివిడత పంచాయతీ ఎన్నికలకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశా రు. ఐదు మండలాలకు ఒక ఏసీపీస్థాయి అధికారిని ఇన్‌చార్జీగా నియమించి, అన్నింటిని సమన్వయం చేసుకునేందుకు మరో ఏసీపీకి విధులు అప్పగించారు. కరీంనగర్ రూరల్ మండలానికి శ్రీనివాస్ జీ, కొత్తపల్లి మండలానికి వెంకటస్వామి, చొప్పదండి మండలానికి సతీశ్‌కుమార్, గంగాధర మండలానికి వేణుగోపాల్, రామడుగు మండలానికి యా దగిరిస్వామిని ఇన్‌చార్జీగా కేటాయించారు. ఐదు మండలాలను సమన్వయం చేసుకునేందకు ఏసీపీ విజయ్‌కుమార్‌కు బాధ్యతలు ఇచ్చారు. మొత్తం 782 మంది సిబ్బంది ఉండగా 19మంది సీఐలు 40 మంది ఎస్సైలు, 34 మందిహెడ్‌కానిస్టేబుళ్లు, 392 మంది కానిస్టేబుళ్లు, 47 స్పెషల్ యాక్షన్ టీం పోలీ సులు, 144 మంది హోంగార్డులు, 100 మంది బెటాలియన్‌తో బందోబస్తు నిర్వహించారు. సీపీ గౌస్‌ఆలం ఐదు మండలాల్లోని వివిధ పోలింగ్ కేంద్రాలను సందర్శించి అవసరమైన సూచనలు అందించారు. ఏసీపీల అనుమతి ఉంటేనే విజయోత్సవ సంబరాల ర్యాలీ నిర్వహించాలని, లేకుంటే కోడ్ ఉల్లంఘన అవుతుందని సీపీ సూచించారు.


