ఆరోగ్యానికి క్రీడలు ముఖ్యం
కరీంనగర్‌స్పోర్ట్స్: ఆరోగ్యానికి వ్యాయామ క్రీడలు దోహదం చేస్తాయని శాతవాహన యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఉమేశ్ కుమార్ అన్నారు. గురువారం వర్సిటీ క్రీడా మైదానంలో సౌత్ జోన్ అంతర విశ్వవిద్యాలయ అథ్లెటిక్ పోటీలను ప్రారంభించారు. వ్యాయామంతో శారీ రక ధృఢత్వం పెరుగుతుందని, ఆత్మధైర్యం పెరుగుతుందన్నారు. విద్యార్థులకు రన్స్, జంప్స్, త్రోస్ విభాగాల్లో ఎంపిక పోటీలు నిర్వహించారు. స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ నజీముద్దీన్ మునవర్, విశ్వవిద్యాలయ స్పోర్ట్స్ కోఆర్డినేటర్ మనోజ్ కుమార్, పీడీ విజయకుమార్, దినేశ్, పర్వీన్, అరవింద్, జిలాని పాల్గొన్నారు.
సీపీఐ మద్దతుదారులను గెలిపించండి
చిగురుమామిడి: చిగురుమామిడి మండలంలోని ఆయా గ్రామాల్లో సీపీఐ బలపర్చిన అభ్యర్థులను సర్పంచ్, వార్డు సభ్యులుగా గెలిపించాలని సీపీఐ మాజీ జాతీయ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఓటర్లను కోరారు. చిగురుమామిడి, సుందరగిరి, రేకొండ గ్రామాల్లో పోటీచేస్తున్న అభ్యర్థులతో కలిసి గురువారం ఇంటింటా ప్ర చారం చేశారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బోయిని అశోక్, గూడెం లక్ష్మి, జిల్లా కౌన్సిల్ సభ్యుడు బూడిద సదాశివ, బోయిని పటేల్, చాడ శ్రీధర్‌రెడ్డి, మావురపు రాజు పాల్గొన్నారు.
కరీంనగర్‌కల్చరల్: యేసుక్రీస్తు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని హైదరాబాద్ ది లైఫ్ చర్చ్‌కు చెందిన అంతర్జాతీయ ప్రవచకుడు డాక్టర్ ఆషేర్ ఆండ్రూ అన్నారు. నగరంలోని కోర్డురోడ్డులోని సెయింట్ మార్క్‌చర్చ్ గ్రౌండ్‌లో గురువారం కరీంనగర్ క్రిస్టియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముందస్తు క్రిస్మస్ వేడుకలకు ప్రధాన ప్రసంగీకుడిగా హాజరై సందేశమిచ్చారు. అంతకు ముందు డాక్టర్ ఆషేర్ ఆండ్రూకు కేసీఏ బాధ్యులు ఘనస్వాగతం పలికారు. కేసీఏ అధ్యక్ష ఉపాధ్యక్షులు ఎం.క్రిస్టోఫర్, ఎంపాలా నాయక్, కార్యదర్శి సురేశ్, సహకార్యదర్శి కెయేల్, కోశాధికారులు ప్రేమసాగర్, బాలరాజు, శ్యాం, అభిలాష్, కృపాకర్ పాల్గొన్నారు.
సిటీలో పవర్‌కట్ ప్రాంతాలు
కొత్తపల్లి: 132 కె.వీ.విద్యుత్ లైన్ నిర్మాణ పనులు చేపడుతున్నందున శుక్రవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 11 కె.వీ., ఎల్‌టీ లైన్ వావిలాలపల్లి ఫీడర్ పరిధిలోని బూత్‌బంగ్లా, అల్ఫోర్స్ కళాశాల, పోచమ్మ ఆలయం, గుండు హనుమాన్‌ఆలయం, తేజస్‌స్కూల్, రెడ్డి ఫంక్షన్ హాల్, సుభాష్‌నగర్ ప్రాంతాలు, ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు చైతన్యపురి ప్రాంతాలతో పాటు విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు పనులు చేపడుతున్నందున ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వాసుదేవకాలనీ, కట్టరాంపూర్, అయోధ్యకాలనీ, రెడ్‌హిల్స్‌కాలనీ, వాసుదేవకాలనీ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్ 1, 2 ఏడీఈలు పి.శ్రీనివాస్‌గౌడ్, ఎం.లావణ్య తెలిపారు.
‘సర్పంచ్‌ల విజయంతో కాంగ్రె్‌స్‌కు మహర్దశ’
కరీంనగర్ కార్పొరేషన్: సర్పంచ్ ఎన్నికలతో కరీంనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు మహర్దశ వచ్చిందని పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు అన్నారు. గురువారం జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు దారులు అధికంగా గెలవడంపై హర్షం వ్యక్తం చేశారు. కరీంనగర్ రూరల్ మండలం నల్లగుంటపల్లి సర్పంచ్‌గా వడ్లూరి అంజయ్య, తహేర్ కొండాపూర్ సర్పంచ్‌గా ఆకుల గిరి, దుబ్బపెల్లి సర్పంచ్‌గా మోతె ప్రశాంత్‌రెడ్డి, ఫకీర్‌పేట్ సర్పంచ్‌గా బొద్దుల విజయలక్ష్మి, బహదూర్ ఖాన్‌పేట్ సర్పంచ్‌గా తిరుపతిరెడ్డిని అభినందించారు. రానున్న రోజుల్లో నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదని పేర్కొన్నారు.
ఆరోగ్యానికి క్రీడలు ముఖ్యం
ఆరోగ్యానికి క్రీడలు ముఖ్యం


