సమాన ఓట్లతో డ్రాలో గెలుపు
● బహుదూర్‌ఖాన్‌పేట 1వ వార్డులో ముగ్గురు పోటీ
కరీంనగర్‌రూరల్: కరీంనగర్ మండలం బహుదూర్‌ఖాన్‌పేట గ్రామపంచా యతీలో 1వ వార్డులో పో టీ చేసిన ముగ్గురు అభ్యర్థులకు సమాన ఓట్లు రావడంతో ఎన్నికల అధి కారులు గురువారం డ్రా విధానంలో ఒకరిని ఎంపికచేశారు.1వ వార్డులో మొత్తం 86 ఓట్లుండగా 83 ఓట్లు పోల్ కాగా రెండు చెల్లలేదు. మిగితా 81 ఓట్లలో పోటీ చేసిన బుర్ర మారుతీ, బుర్ర సంపత్‌కుమార్, బుర్ర తిరుపతి లకు 27 ఓట్లు సమానంగా వచ్చాయి. దీంతో ముగ్గురు అభ్యర్థుల అంగీకారంతో డ్రా తీయగా బుర్ర మారుతి గెలుపొందారు.
కరీంనగర్: కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ సత్తా చాటింది. గత పంచాయతీ ఎన్నికల్లో 800లకు పై చిలుకు గ్రామ పంచాయతీల్లో ఎన్ని కలు నిర్వహిస్తే కేవలం 22 స్థానాల్లో బీజేపీ బలపర్చిన అభ్యర్థులు గెలిచారు. ఈసారి కేంద్ర మంత్రి బండి సంజయ్ కమార్ ఆధ్వర్యంలో తొలి దశ ఎన్నికల్లోనే 40కిపైగా స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయ కేతనం ఎగురవేశారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో తొలిదశ ఎన్నికల్లో 160 స్థానాల్లో బీజేపీ బలపర్చిన అభ్యర్థులు పోటీ చేశారు. అందులో నాలుగో వంతుకుపైగా గెలుపొందడం విశేషం. తొలిదశ ఎన్నికల్లో గెలిచిన మరో 10 మందికి ఇండిపెండింట్ అభ్యర్థులు బండి సంజయ్ సమక్షంలో బీజేపీ గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. బండి సంజయ్ ఎంపీగా, కేంద్ర మంత్రిగా కొనసాగుతన్నందున ఎంపీ లాడ్స్, సీఎస్సార్ ఫండ్స్ తోపాటు కేంద్రంతో మాట్లాడిన అత్యధిక నిధులను గ్రామ పంచాయతీల అభివృద్ధికి తీసుకొచ్చే అవకాశముందని వారు భావిస్తున్నారు.


