కౌన్సెలింగ్.. స్వచ్ఛంద సేవ
పున్నం చందర్ కొన్నేళ్లుగా జిల్లా కేంద్రంలో సైకాలజిస్టుగా సేవలందిస్తున్నారు. జీవితంపై నిరాసక్తితో ఆత్మహత్యే శరణ్యమనుకునే వాళ్లను గుర్తించి కౌన్సెలింగ్ ప్రక్రియతో వారిలో విశ్వాసం నింపుతున్నా రు. ఈమేరకు కార్మికులు ఉండే ప్రాంతాల్లో క్రమం తప్పకుండా అవగాహన శిబిరాలు నిర్వహిస్తున్నా రు. కుటుంబ తగాదాలు, దంపతుల భావోద్వేగపరమైన సమస్యల విషయంలో అదే రీతిలో స్పందిస్తున్నారు. కౌమారదశలో బాలికలకు స్వీయ ఆత్మరక్షణ విద్య, గృహహింస బాధితులకు సాయం, బాలల వికాసంపై సెమినార్లు నిర్వహిస్తున్నారు. ఈ సేవలను గుర్తించిన సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సెల్ మానవహక్కుల దినో త్సవం రోజున హైదరాబాద్‌లో గ్లోబల్‌ఐకాన్ అవార్డునిచ్చి సత్కరించింది.


