అనాథ వృద్ధులకు పెద్ద దిక్కు
గంభీరావుపేట(సిరిసిల్ల): రెండు దశాబ్దాలుగా అనాథ వృద్ధుల సేవలో తరిస్తున్న మల్లుగారి నర్సాగౌడ్‌కు అరుదైన గౌరవం దక్కింది. గంభీరావుపేట మండల కేంద్రంలో ‘మా’ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నర్సాగౌడ్ అనాథ వృద్ధుల ఆశ్రమాన్ని 20 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. మలిసంధ్యలో అన్నీ తానై వారి బాగోగులు చూసుకుంటున్నారు. తనువు చాలించిన వారికి కన్నకొడుకులా అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఆశ్రమంలో ప్రస్తుతం 31 మంది అనాథ వృద్ధులు ఉన్నారు. తన సొంతింటిలో ఆశ్రమం నిర్వహిస్తున్నారు. ఈ సేవలను గుర్తించి 9వ తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఫార్మేషన్ డే సందర్భంగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ చేతుల మీదుగా గురువారం ‘సేవా రత్న’ అవార్డు అందుకున్నారు. నర్సాగౌడ్‌కు అవార్డు రావడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


