దివ్యాంగులు ఇలా ఓటు వేయండి..
కరీంనగర్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల్లో దివ్యాంగులకు సహాయం చేసేందుకు 18 ఏళ్లు నిండిన సహాయకుడిని ఎంపిక చేసుకోవచ్చని ఎన్నికల నిబంధనల్లో ఉంది. ఇదే విషయాన్ని పోలింగ్ కేంద్రంలోని రిటర్నింగ్ అధికారికి తెలిపితే ఆయన అనుమతి ఇస్తారు. దివ్యాంగులు సహాయకుడితో లోపలికి వెళ్లి ఓటుహక్కును వినియోగించుకోవచ్చు. ఎవరికి ఓటు వేశారనే విషయాన్ని సహాయకుడు గోప్యంగా ఉంచడంతోపాటు మరోమారు ఇతరులకు సహాయకుడిగా రానంటూ అతను డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సాధారణంగా ఓటువేసే వ్యక్తి ఎడమచేతి చూపుడు వేలికి సిరా గుర్తు వేస్తారు. సహాయకుడిగా వచ్చిన వ్యక్తికి మాత్రం కుడిచేతి చూపుడు వేలికి గుర్తువేస్తారు.
స్మార్ట్ ఫోన్‌కు అనుమతి లేదు
పోలింగ్ కేంద్రంలోకి స్మార్ట్‌ఫోన్లకు అనుమతి లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌ను పోలింగ్ కేంద్రంలోకి తీసుకెళ్లడం నిషేధమన్నారు. ఎవరైనా స్మార్ట్‌ఫోన్ తీసుకొస్తే స్విచ్ ఆఫ్ చేసి భద్రత సిబ్బంది లేదా పోలింగ్ సిబ్బంది లేదా బీఎల్‌వో వద్ద ఉంచాలని స్పష్టం చేశారు.
రామగుండం: గోదావరిఖని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ గుర్తు తెలియని వృద్ధురాలు గురువా రం మృతిచెందినట్లు రైల్వే పోలీసులు పేర్కొన్నారు. జీఆర్పీ ఔట్‌పోస్టు ఇన్‌చార్జి తిరుపతి తెలిపిన వివరాలు.. అక్టోబర్ 24న సుమారు 70 ఏళ్ల వృద్ధురాలు రైల్వేవంతెన కింద పట్టాల పక్కన తీవ్రగాయాలతో ఉండడంతో స్థానికులు గుర్తించి 108కు సమాచారం అందించారు. చికిత్స నిమిత్తం గోదావరిఖని ప్రభుత్వాసుపత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ గురువారం మృతిచెందింది. మృతురాలి వద్ద ఎలాంటి గుర్తింపుకార్డులు లభ్యం కాకపోవడంతో మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచారు. ఎవరైనా బంధువులు గుర్తిస్తే 99493 04574, 87126 58604 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
లారీ బోల్తాపడి ముగ్గురికి గాయాలు
ధర్మపురి: లారీ బోల్తాపడిన ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. మండలంలోని ఆకసాయిపల్లె గుట్టమలుపు వద్ద ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని తప్పించబోయిన ఐరన్‌లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న ముగ్గురికి స్వల్పగాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు.
డబ్బులు పంచుతూ పట్టుబడిన వ్యక్తి
ఇబ్రహీంపట్నం: మండలంలోని తిమ్మాపూర్‌లో గురువారం ఉడయం ఏడు గంటల సమయంలో దాసరి రాజేశ్ ఓటర్లకు డబ్బులు పంచుతుండగా.. ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి రేవంత్ పట్టుకున్నారు. రాజేశ్ నుంచి రూ.40వేలు స్వాధీనం చేసుకుని పోలిసులకు అప్పగించినట్లు ఆయన తెలిపారు.
దివ్యాంగులు ఇలా ఓటు వేయండి..
దివ్యాంగులు ఇలా ఓటు వేయండి..


