వినూత్నంగా ఫ్లెక్సీ ఏర్పాటు
జమ్మికుంట: పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓ గ్రామంలో వినూత్నంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. మండలంలోని జగ్గయ్యపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని రంగమ్మపల్లి గ్రామంలో డబ్బులు, మద్యం తమకు వద్దని గ్రామ అభివృద్ధి చేసే సర్పంచ్, వార్డు మెంబర్లకు ఓట్లు వేస్తామని ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. రంగమ్మపల్లి భూలక్ష్మి దేవతల వద్ద సీసీ రోడ్డు ,డ్రైనేజీ నిర్మించే నాయకులు కవాలని ఫ్లెక్సీలో పేర్కొన్నారు.
ధర్మపురిలో ఫుడ్‌సేఫ్టీ అధికారుల తనిఖీలు
ధర్మపురి: ధర్మపురిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు గురువారం తనిఖీలు చేపట్టారు. దీంతో వివిధ దుకాణదారులు వారివారి షాపులను మూసివేశారు. ఫుడ్‌సేఫ్టీ జిల్లా అధికారి అనూష ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టగా విషయం తెలిసిన వెంటనే షాపులకు తాళం వేసి వెళ్లిపోయారు. కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. బస్టాండ్ సమీపంలో ఉన్న ఓ బేకరిలో తనిఖీలు చేసి యజమానికి రూ. పది వేల జరిమానా విధించారు.


