అద్దె చెల్లించడం లేదని వాటర్ ప్లాంట్ మూత
ధర్మపురి: మున్సిపాలిటీకి డాక్టర్ వాటర్ ప్లాంట్ యజమానికి అద్దె చెల్లించకపోవడంతో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్లాంట్‌ను మూసివేశారు. ధర్మపురి మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు 2011లో డాక్టర్ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. ప్లాంట్‌ను సుకుమార్ అనే వ్యక్తి నిర్వహిస్తున్నప్పటికీ అద్దె మాత్రం చెల్లించడంలేదు. దీంతో కమిషనర్ అద్దె చెల్లించాల్సిందేనంటూ ప్లాంట్‌లో విధులు నిర్వర్తిస్తున్న కర్నె గంగాధర్‌కు సూచించారు. సుకుమార్‌కు సమాచారం చేరవేయాలని కోరినా.. నిర్లక్ష్యం చేస్తున్నారు. అద్దె బకాయిలు రూ.5లక్షలకుపైగా చేరడంతో వారం క్రితం మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు ప్లాంట్‌కు తాళం వేశారు. ప్లాంట్ మూసివేయడంతో చుట్టుపక్కల ఇళ్లవారు తాగునీటికి ఇబ్బంది పడుతున్నారు.


