వృద్ధులకు బాసటగా..
కనిపెంచిన వారసుల చేతిలో నిర్లక్ష్యానికి గురవుతున్న వయోవృద్ధులు, ఆస్తులు లాక్కుని అన్నానికి దూరం చేసిన అయిన వాళ్ల నుంచి బాధలు పడుతూ నిస్సహాయ స్థితికి చేరిన వృద్ధులకు బాసటగా నిలుస్తున్నారు ఆర్డీవో వెంకటేశ్వర్లు. ఏడు నెలల క్రితం సిరిసిల్లకు ఆర్డీవోగా బాధ్యతలు తీసుకునే నాటికి జిల్లా కేంద్రంలో బాధలు పడుతున్న వృద్ధుల కేసులు సుమారు 60 వరకు పెండింగ్‌లో ఉండేవి. ఆర్డీవోగా బాధ్యతలు తీసుకున్న వెంటనే కేసులపై దృష్టి సారించారు. స్వల్పకాలంలోనే 40 కేసులను పరిష్కరించి వారసుల చేత ఇబ్బందిపడుతున్న వయోవృద్ధులకు ఊరట కలిగించారు. ఉద్యోగ బాధ్యతల్లో తలమునకలుగా ఉన్నప్పటికీ వయోవృద్ధుల సమస్యలపై మానవత దృక్పథంతో స్పందిస్తూ త్వరితగతిన కేసుల పరిష్కారానికి చొరవ చూపుతున్న సేవలను గుర్తించిన ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ గురువారం తమ సంస్థ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఘనంగా సత్కరించింది. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌శర్మ చేతుల మీదుగా బెస్ట్ ప్రిసైడింగ్ అఽధికారిగా గుర్తించారు. అలాగే సేవారత్న బిరుదునిచ్చి సత్కరించారు.


