ఆరోగ్య సేవలు
జిల్లా కేంద్రంలోని రాజీవ్‌నగర్‌కు చెందిన అలువాల ఈశ్వర్ ఆర్‌ఎంపీగా కార్మిక ప్రాంతంలోని నిరుపేదలకు సేవలు అందిస్తున్నారు. హెల్పింగ్‌హార్ట్స్ స్వచ్ఛంద సంస్థ ద్వారా నేతకార్మికుల్లో మానసిక ఒత్తిడి తగ్గించేందుకు శిబిరాలు, మద్యపాన వ్యసనం నుంచి బయటపడేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలలకు అవసరమైన సామగ్రిని సేకరించి సమకూర్చడం, పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన పెంచడం, దివ్యాంగులకు సహాయం తదితర సేవలు అందిస్తున్నారు. ఈ సేవలను గుర్తించి గ్లోబల్‌ఐకాన్ అవార్డునిచ్చి సత్కరించింది.


