చీరకు నిప్పంటుకొని వృద్ధురాలు సజీవ దహనం
కోరుట్లరూరల్: సంగెం గ్రామానికి చెందిన గోపిడి హన్మక్క(81) చీర కొంగుకు నిప్పంటుకొని సజీవ దహనమైంది. స్థానికుల వివరాల ప్రకారం.. హన్మక్క ఆదివారం ఉదయం కట్టెల పొయ్యిపై వంట చేస్తుండగా చీర కొంగుకు మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో చీర పూర్తిగా కాలి శరీరానికి నిప్పంటింది. కుటుంబ సభ్యులు వెంటనే అంబులెన్స్‌లో కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొదుతూ బుధవారం మృతిచెందింది. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


