● ఎమ్మెల్యే గంగుల కమలాకర్
కరీంనగర్‌కల్చరల్: తెలంగాణ అంత ఎత్తుకు ఎదిగిన కవి దాశరథి అని, ఆయన ఏ ఒక్కరి సొత్తు కాదని, తెలంగాణ రాష్ట్రానికి అసలు సిసలైన సాహిత్య ఆస్తి దాశరథి అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. తెలంగాణ రచయితల సంఘం కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఫిలిం భవన్‌లో జరిగిన దాశరథి శత జయంతి వేడుకలకు హాజరై మాట్లాడారు. ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి కార్యక్రమాలు చేయకుండా దాశరథిని విస్మరించిందని, దాశరథి శత జయంతిని ప్రభుత్వపరంగా సంవత్సరంతా నిర్వహిస్తూ ఉత్సవాలు చేయాలని, దాశరథి పురస్కారాన్ని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. దాశరథి శత జయంతి సదస్సును ఘనంగా నిర్వహిస్తున్న సంస్థ అధ్యక్షుడు కొత్త అనిల్‌కుమార్, అతడి కార్యవర్గాన్ని అభినందించారు. దాశరథి జీవితం, సాహిత్యంపై డాక్టర్ గన్నమరాజు గిరిజామనోహర్‌బాబు, దాశరథి సినిమా సాహిత్యంపై నిజాం కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ తిరునగరి శరత్‌చంద్ర ఉపన్యాసాలు చేశారు. కవులను గంగుల కమలాకర్ సన్మానించారు. కవులు డాక్టర్ గండ్ర లక్ష్మణరావు, గజేందర్‌రెడ్డి, డి.రాజారామ్మోహన్, గాజుల రవీందర్, శంకర్‌ప్రసాద్, కాండూరి వెంకటేశ్వర్లు, నీలగిరి అనిత, చిందం సునీత, బొమ్మకంటి కిషన్ తదితరులున్నారు.