
అభివృద్ధి పేరుతో ఆర్థిక విధ్వంసం
● సుడా చైర్మన్ నరేందర్‌రెడ్డి
కరీంనగర్ కార్పొరేషన్: గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నగరంలో అభివృద్ధి పేరిట ఆర్థిక విధ్వంసం చేశారని సుడా చైర్మన్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి ధ్వజమెత్తారు. అసూయ, అధికారం పోయిందనే బాధతో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు. శుక్రవారం నగరంలోని డీసీసీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నగర అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రులు పట్టించుకోవడం లేదని గంగుల విమర్శించడాన్ని తప్పుబట్టారు. గతంలో నాణ్యత లేకుండా పనులు జరిగాయని, అక్రమాలు చోటుచేసుకున్నాయని వాటిపై విజిలెన్స్ విచారణ కొనసాగుతుందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తయ్యిందని, సాంకేతిక సమస్య కారణంగా జాప్యం జరిగిందన్నారు. నియోజకవర్గంలో ఏటా 3500 ఇండ్లు ఇస్తామన్నారు. పదేండ్లలో కేవలం 640 డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం చేపట్టి, అవికూడా పూర్తి చేయలేకపోయారన్నారు. పాత మున్సిపల్‌గెస్ట్ హౌజ్‌లో చేపట్టిన భవన నిర్మాణాన్ని అర్ధాంతరంగా వదిలేయడంతో అసాంఘీకకార్యకలాపాలకు వేదికగా మారిందన్నారు.రూ.78 లక్షలతో ఆ భవన ని ర్మాణాన్ని పూర్తి చేస్తున్నామన్నారు. కేంద్రమంత్రి బండి సంజయ్ సొంత ఖర్చులతో సైకిళ్లు ఇవ్వనప్పుడు అవి బర్త్‌డే గిఫ్ట్‌లు ఎలా అవుతాయన్నారు. తన ప్రచారం కోసం రెండు వేల మందిని పిలిచి ఇవ్వడంతో ఓ విద్యార్థి సైకిల్ నుంచి పడి గాయాలపాలయ్యాడన్నారు. సమావేశంలో ఎండీ. తాజ్, బానోతు శ్రవణ్‌నాయక్, కొరివి అరుణ్‌కుమార్, దన్నసింగ్, సుదర్శన్‌తదితరులు పాల్గొన్నారు.