
చైన్ స్నాచింగ్ కేసులో ఇద్దరి అరెస్టు
కరీంనగర్‌క్రైం: ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళ మెడలోంచి బంగారు చైన్ దొంగలించిన ఇద్దరుని త్రీ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధి ంచిన వివరాలను సీఐ జాన్‌రెడ్డి వెల్లడించారు. ఈ యన కథనం ప్రకారం.. నగరంలోని మారుతినగర్ కు చెందిన స్వరూప ఇంట్లో నిద్రిస్తోంది. బుధవార ం వేకువజామున నగరానికి చెందిన చింతకింద స దాశివ, టేకుమల్ల నాగరాజు మహిళ ఇంట్లోకి ప్రవేశించి, ఆమె మెడలోంచి 42 గ్రాముల బంగారు గొ లుసు అపహరించారు. మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన త్రీటౌన్ పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించారు. నాగరాజును గర్రెపల్లి సమీపంలో, సదాశివను హౌజింగ్‌బోర్డుకాలనీలో అరెస్టు చేసి, చై న్, బైకు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
మహిళలు అప్రమత్తంగా ఉండాలి
ఇంట్లో ఒంటరిగా నివసించే మహిళలు అప్రమత్తంగా ఉండాలని సీపీ గౌస్ ఆలం సూచించారు. మారుతినగర్‌లో ఒంటరిగా నిద్రిస్తున్న మహిళ మెడలోంచి దుండగులు బంగారం చోరీచేసిన ఘటనను గుర్తుచేశారు. ఊరెళ్లేవారు ఇంట్లోని బంగారు ఆభరణాలు, నగదును బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవాలని లేదా సురక్షితంగా దాచుకోవాలని సూచించారు. ఇంటి ప్రధాన ద్వారానికి సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ఎటైనా వెళ్తే స్థానిక పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.