
అక్రమ నిర్మాణాలు తొలగింపు
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో అక్రమ నిర్మాణాలపై నగరపాలకసంస్థ దృష్టి సారించింది. క మిషనర్ ప్రఫుల్‌దేశాయ్ ఆదేశాల మేరకు పట్టణ ప్రణా ళిక విభాగం అధికారులు అనుమతి లేని నిర్మాణాలపై చర్యల కు పూనుకున్నారు. అందిన ఫిర్యాదుల మేరకు నగరంలోని ప లు అక్రమ నిర్మాణాలను తొలగించిన అధికారులు, గురువా రం మరో రెండు కూల్చివేతలు చేపట్టారు. ఆరెపల్లిలో రోడ్డును ఆక్రమించి చేపట్టిన ప్రహరి, షెడ్‌ను జేసీబీతో తొలగి ంచారు. బ్యాంక్‌కాలనీలో డెడ్‌ఎండ్ స్ట్రీట్‌లో వేసిన టిన్‌షెడ్‌ను తొలగించారు. పట్టణ ప్రణాళిక విభాగం ఇన్‌చార్జి డీసీపీ బషీర్, ఏసీపీలు వేణు, శ్రీధర్, టీపీఎస్‌లు తేజస్విని, సంధ్య పాల్గొన్నారు.
5 ట్రాక్టర్లు, జేసీబీ పట్టివేత
సిరిసిల్లక్రైం: నిబంధనలు అతిక్రమించి అక్రమంగా మట్టిని తవ్వి సరఫరా చేస్తున్న వాహనాలను జిల్లా టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ సీఐ నటేశ్ తెలిపిన వివరాలు. ముస్తాబద్ మండలం చిప్పలపల్లి శివారులో నిబంధనలకు విరుద్ధంగా మట్టిని తవ్వి తరలిస్తున్నారన్న సమాచారంతో ఎస్పీ ఆదేశాలతో దాడులు చేశారు. ఐదు ట్రాక్టర్లు, ఒక జేసీబీని స్వాధీనం చేసుకున్నారు.