
పవర్ కట్ ప్రాంతాలు
కొత్తపల్లి: విద్యుత్ మరమ్మతు పనులు చేపడుతున్నందున గురువారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు 11 కేవీ గీతాభవన్ ఫీడర్ పరిధిలోని మార్క్‌ఫెడ్, ప్రగతినగర్, రాంనగర్, మంకమ్మతోట లేబర్‌అడ్డ, రాజీవ్‌పార్కు, పద్మనగర్ పారమిత స్కూల్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్ 1 ఏడీఈ ఎం.లావణ్య తెలిపారు.
కొత్తపల్లిలో.. విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు పనులు చేపడుతున్నందు గురువారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 11 కేవీ కొత్తపల్లి టౌన్ ఫీడర్ పరిధిలోని కొత్తపల్లిలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు కరీంనగర్ రూరల్ ఏడీఈ గాదం రఘు వివరించారు.