
శ్మశానవాటికలో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేస్తారా?
పెద్దపల్లిరూరల్: రాఘవాపూర్ శివారులోని ప్రభుత్వ స్థలంలో అప్పన్నపేట ప్రాథమిక సహకార సంఘం ఏర్పాటు చేసే సోలార్ ప్లాంట్ స్థలం కేటాయింపు వివాదాస్పదమైంది. శ్మశానవాటిక కోసం వినియోగించుకుంటున్న స్థలంలో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయడమేమిటని గ్రామస్తులు ప్రశ్నించారు. ఈమేరకు మంగళవారం చదును పనులను అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. అంత్యక్రియల కోసం వినియోగిస్తున్న స్థలంలో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు సరికాదన్నారు. పనులను నిలిపివేయించిన గ్రామస్తులు.. ఆ తర్వాత కలెక్టరేట్‌కు తరలివెళ్లారు. అడిషనల్ కలెక్టర్ వేణును కలిసి వినతిపత్రం అందజేశారు. శ్మశానవాటికలో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు ప్రతిపాదనను విరమించుకోవాలని వారు కోరారు.
రాఘవాపూర్‌లో గ్రామస్తుల నిరసన
స్థలం మార్చాలని అధికారులకు ఫిర్యాదు

శ్మశానవాటికలో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేస్తారా?