
ప్రమాణాలు పాటించకనే కాళేశ్వరం కుంగుబాటు
శంకరపట్నం(మానకొండూర్): కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో సాంకేతిక ప్రమాణాలు పాటించకపోవడంతోనే కుంగిపోయిందని, బాధ్యులపై ప్రభుత్వం కేసు నమోదు చేయాలని తెలంగాణ జనసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. సోమవారం ప్లీనరీ సమావేశంలో మాట్లాడారు. రూ.లక్ష కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం నిర్మిస్తే కాంట్రాక్టర్‌లు, బీఆర్‌ఎస్ నేతలు లబ్ధి పొందారని ఆరోపించారు. అవినీతి పాల్పడిన నాయకులు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నిరంకుశపాలనను అంతం చేయడానికి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చామని వివరించారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్ట్ నిర్మించి అంబేడ్కర్ సుజల స్రవంతి అని నామకరణం చేయాలన్నారు. అనంతరం తెలంగాణ అమరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించారు. కోదండరాంకు జిల్లా కన్వీనర్ మోరె గణేశ్ నాగలిని బహూకరించారు. రాష్ట్ర ప్రధన కార్యదర్శులు ముక్కెర రాజు, అరికెల్ల స్రవంతి, ధర్మార్జున్, మండల అధ్యక్షుడు రమేశ్, శ్రీనివాస్, సతీశ్, భానుకిరణ్, సాయిరాం, అరుణ్, రాజేశ్ పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ కోదండరాం