
ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యాయత్నం
మేడిపల్లి: మండలంలోని కొండాపూర్ గ్రామానికి చెందిన గోడిశెల గట్టయ్య ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికుల కథనం ప్రకారం.. గట్టయ్యకు ఇద్దరు కొడుకులు. ఏ పనీ చేయకుండా ఖాళీగా ఉంటున్నారు. భార్యకు లోకజ్థానం తక్కువ. మరోవైపు ఆర్థిక ఇబ్బందులు. ఈ క్రమంలో మనస్తాపంతో ఆదివారం ఉదయ క్రిమిసంహారక మందు తాగాడు. స్థానికులు అతడిని వెంటనే జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. మంగళవారం ఉదయం ఇంటికి చేరిన ఆయన సాయంత్రం సమయంలో మల్యాల మండలం కొండగట్టు ప్రాంతంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. కేకలు వేయడంతో స్తానికులు గమనించి మంటలు ఆర్పి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు గట్టయ్యను కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.