
గొప్పనేత వైఎస్సార్
● మాజీ మంత్రి జీవన్‌రెడ్డి
జగిత్యాల టౌన్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి గొప్ప నేత అని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి కొనియాడారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా జిల్లాకేంద్రంలోని ఇందిరాభవన్‌లో కేక్ కట్ చేసి పంచిపెట్టారు. అనంతరం మాట్లాడుతూ.. జగిత్యాల జిల్లాతో వైఎస్సార్‌కు ఎనలేని మమకారం ఉందని, అందుకే జిల్లాకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. నాచుపల్లిలో జెఎన్‌టీయూ, కోరుట్లలో వెటర్నరీ కళాశాల, జగిత్యాలలో పండ్ల మార్కెట్ ఆయన చలవే అన్నారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.